కమిన్స్ సలహాతోనే..రాణించా!

5
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిరీస్‌కు ముందు, అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను సంప్రదించి ఇంగ్లాండ్ కండిషన్లపై సలహా తీసుకున్నాడు. కమ్మిన్స్ స్పందిస్తూ, ఇంగ్లాండ్‌లో వాతావరణం ఆటపై ఎంతో ప్రభావం చూపుతుందని వివరించాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఎలాంటి తేడా ఉంటుంది? ఇది నా తొలి టూర్ కాబట్టి తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఆయన చెప్పింది – పెద్దగా మార్పు లేదు కానీ వాతావరణ పరిస్థితులపై దృష్టి పెట్టు, నీ ఆటని ఆడుకో అని చెప్పాడని నితీశ్ తెలిపారు. ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో విస్తృతంగా చర్చించానని చెప్పారు.

మోర్నేతో కూడా నేను చర్చలు జరిపాను. నా బౌలింగ్‌లో మంచి ప్రగతి కనిపిస్తోంది. ఆయనతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.గత ఆస్ట్రేలియా టూర్ తర్వాత బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాలి అనిపించింది. ఇప్పుడు నేను సాధించాలనుకుంటున్నది తెలిపారు నితీశ్‌.

Also Read:బీసీ రిజర్వేషన్లు..చిత్తశుద్ది నిరూపించుకోవాలి

- Advertisement -