రాజస్థాన్ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు!

6
- Advertisement -

సంజు శాంసన్ ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)‌కు మారబోతుండగా రాజస్థాన్ రాయల్స్ తమకు కొత్త కెప్టెన్‌ను నియమించుకోవాల్సిన అవసరం వచ్చింది. శాంసన్‌ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన నవంబర్ 15న జరిగే రిటెన్షన్ ప్రకటనకు ముందు రానుందని తెలుస్తోంది. శాంసన్‌కు బదులుగా రాజస్థాన్ జట్టు రవీంద్ర జడేజా మరియు సామ్ కరన్ జట్టులో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్,నితీశ్‌ రానా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వాస్తవానికి గతేడాది జైస్వాల్ కు కెప్టెన్సీ అప్పగిస్తారని ప్రచారం జరిగినా ఊహించని విధంగా రియాన్ పరాగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు జైస్వాల్‌ను అధికారికంగా పూర్తి సీజన్‌కు కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. ఇది రాజస్థాన్ రాయల్స్‌కి కొత్త యుగానికి నాంది కావచ్చు.

శాంసన్ లేని సమయంలో గత సీజన్‌లో రాయల్స్‌కు కెప్టెన్‌గా రియాన్ పరాగ్ నియామకం ఆశ్చర్యంగా అనిపించింది. పరాగ్‌కి కెప్టెన్‌గా ప్రారంభం సజావుగా సాగలేదు కానీ రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ఆయనను మొదటి నుంచే గట్టిగా ప్రోత్సహిస్తోంది. అందువల్ల పరాగ్‌ను శాశ్వత కెప్టెన్‌గా కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

నితీశ్ రాణాకు కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ అవకాశముంది. ఫ్రాంచైజీ ఆయనను విడుదల చేయకపోతే రాణాకు ఐపీఎల్‌లో నాయకత్వ అనుభవం ఉంది. 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు కెప్టెన్‌గా ఉన్నారు. ఆ సీజన్‌లో ఆయన 14 మ్యాచ్‌లు ఆడగా 6 గెలిచి, 8లో ఓడిపోయాడు.

Also Read:ఓటమి భయంతోనే..రేవంత్ రివ్యూ మీటింగ్‌లు!

- Advertisement -