- Advertisement -
బిహార్ కాబోయే సీఎంగా నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించాయి ఎన్డీఏ వర్గాలు. పట్నాలో జరిగిన ఎన్డీఏ కూటమ సమావేశంలో నితీశ్‌ను కాబోయే సీఎంగా ఎన్నుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నితీశ్‌కుమార్ నివాసంలో జరిగిన సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. నితీశ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఏడోసారి బీహార్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు.
జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ కూటమికి 125 స్థానాలు లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కింది. బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 4, హెచ్ఏఎం 4 స్థానాలను సాధించాయి.
- Advertisement -