ఆగ‌స్ట్ 9న నితిన్ శ్రీనివాస కళ్యాణం..

214
nitin srinivasa kalyanam
- Advertisement -

నితిన్ ప్ర‌స్తుతం శ్రీనివాస క‌ళ్యాణం సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈచిత్రానికి శత‌మానం భ‌వ‌తి సినిమా ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ‌ష్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నితిన్ స‌ర‌స‌న హీరోయిన్ గా రాశిఖ‌న్నా న‌టిస్తుంది. ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమా నుండి మొద‌టిపాట‌ను ఇటివ‌లే విడుద‌ల చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన్ మెంట్ తో ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

nithin srinivasa kalyanam

తాజాగా ఈసినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ను టీజర్‌ను విడుద‌ల చేశారు. పెళ్లి గొప్ప‌త‌నం గురించి ఈసినిమాలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. బొమ్మ‌రిల్లు సినిమా విడుద‌ల చేసిన రోజునే ఆగ‌స్టు 9న శ్రీనివాస క‌ళ్యాణం సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. నితిన్ చివ‌రి సినిమా ఛ‌ల్ మోహ‌న్ రంగ కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భించినా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టలేక పోయింది. 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో నితిన్ న‌టిస్తుండ‌టంతో ఈసినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు నితిన్.

- Advertisement -