ప్చ్.. నిత్యా మీనన్ కి ఇదేం రోగం?

97
- Advertisement -

నిత్యా మీనన్ అనగానే చాలా పద్దతి గల హీరోయిన్ అని పేరు. బట్టలిప్పి బరితెగించడం, బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఇరగదీయడం వంటివి నిత్యా మీనన్ చేయదు. ఇక లిప్ లాకులు, హగ్గులతో రెచ్చిపోవడాలు కూడా నిత్యా మీనన్ చేయదు. అలాగే, వెగటు స్టెప్పులతో ఐటమ్ సాంగ్స్ కూడా చేయదు. అదే వేరే హీరోయిన్లు అయితే, కథ డిమాండ్ చేసింది అని ఓ పిచ్చి సమర్థన చేసుకుని ఎంతకైనా తెగిస్తారు. అంతా డబ్బుల మాయ, రెమ్యునరేషన్ ఏ పనైనా చేయిస్తుంది… లేదంటే ఏ ఆఫర్లూ రాకపోతే ఎంతకైనా దిగొచ్చేలా చేస్తుంది. ఐతే, నిత్యా మీనన్ లాంటి వాళ్ళకి ఇలాంటి స్టేట్ మెంట్లు కూడా పని చేయవు అని ఇన్నాళ్లు ఓ వాదన ఉండేది.

కానీ, ఆ వాదన నేటితో ముగిసిందనే చెప్పాలి. నిత్యా మీనన్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సిరీస్ లో ఆమె మెయిన్ లీడ్. ఎవరో హిందీ నటుడు హీరోగా నటిస్తున్నాడు. ఐతే, ప్రస్తుతం చేస్తున్న సీన్ మరీ బోల్డ్ గా ఉంది. హీరో మీద కూర్చున్న ఫోజుతో నిత్యా మీనన్ లిప్ లాక్ ఇచ్చిందట. ఆ మధ్య ఓ సిరీస్ లో తోటి నటికీ కూడా కారులో నిత్యా మీనన్ లిప్ లాక్ ఇచ్చింది. సరే ఆమె అబ్బాయికి ఇవ్వలేదు కదా అని అందరూ కామెంట్స్ చేశారు. నిజానికి ఆమె ఇలాంటి వెబ్ సిరీస్ లు చేయడమే చాలామందికి జీర్ణం కావడం లేదు.

దీనికితోడు నిత్యా మీనన్ ఇలా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతే.. ఆమె పై ఫుల్లు నెగెటివ్‌ కామెంట్స్ వస్తున్నాయి. సరే, ఆమెకు అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయాలకు వోకే చెబుతోందా..? అనివార్యమా..? కాదు… మంచి డిమాండ్ ఉన్న నటే… మరి అలాంటప్పుడు నిత్యా మీనన్ ఎందుకు ఇలా నటిస్తోంది ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ‘ఆఫర్లు లేకపోతే టీవీ సీరియళ్లు చేసుకో, కానీ ఇదేం రోగం’’ అంటూ నిత్యా మీనన్ పై ఈ సిరీస్ గురించి తెలిసిన వాళ్ళు మండిపడుతున్నారు… ఈ స్పందన ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు ఆమె… అవును మరి, నిత్యా మీనన్ నుంచి ఆ రేంజ్ బోల్డ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా మరి…

Also Read:Allu Arjun:బన్నీ అక్కడ కొత్త ఇల్లు కొన్నారా?

- Advertisement -