అక్షయ్‌తో నిత్యా మిషన్ మంగళ్‌

269
nithya menon
- Advertisement -

నిత్యామీనన్ ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్‌. తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన నిత్యా… తనకి నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతూ వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వస్తోంది.

తెలుగులో ‘అ’ మూవీతో మెప్పించిన నిత్యా …త్వరలో ప్రాణగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ పట్టాలపై ఉండగానే బాలీవుడ్‌ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మంగళ్’ చిత్రంలో ఓ నాయికగా నిత్యా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఈ చిత్రంలో విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు.

akshay kumar  mission mangal

నిత్యామీనన్ కు ఇదే మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేయనున్నారు. ప్యాడ్ మ్యాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్.బల్కితో పాటు జగన్ శక్తి ఈ సినిమాని డైరక్ట్ చేయబోతున్నారు. బాలీవుడ్‌ ఎంట్రీతో నిత్యా మీనన్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -