బిహార్ ముఖ్యమంత్రి గత ఏడాది అనూహ్యంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ప్రత్యర్థి పార్టీ అయిన ఆర్జేడితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. విపక్షలను ఏకం చేస్తూ తనదైన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 26 బిజెపి వ్యతిరేక పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ” INDIA ” కూటమిగా ఏర్పడ్డాయంటే అది నితిశ్ కుమార్ చూపిన చొరవే అని ఒప్పుకోక తప్పదు.
అయితే INDIA కూటమి ఆద్యం పోసింది నితీశ్ కుమారే అయినప్పటికి కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని నేషనల్ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామదాస్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీయే లోకి రావోచ్చని, ఆయన కోసం ఎన్డీయే తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read:సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..
దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం విపక్ష కూటమిలో ముఖ్య భూమిక పోషిస్తున్న నితీశ్ తిరిగి మళ్ళీ ఎన్డీయేలో చేరే అవకాశం ఉందా ? ఒకవేళ అదే నిజమైతే నితిశ్ రాక ను బీజేపీ అధిష్టానం స్వాగతిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్ర మంత్రి రామదాస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడి మాట్లాడుతూ.. నితిశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితిలో ఎన్డీయే కూటమి స్వాగతించదని, కేంద్ర మంత్రి రామదాస్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమే తప్పా.. పార్టీ పరమైనవి కాదని స్పష్టం చేశారు. దీంతో నితిశ్ ను బీజేపీ స్వాగతించే అవకాశం లేదని తేలిపోయింది.
Also Read:ఆ అలవాటుకు.. అరటిపండే పరిష్కారం