నితీశ్‌..ఏం చేసినా ప్రత్యేకమే!

27
- Advertisement -

దేశ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ది ప్రత్యేక శైలీ. జేడియూ పగ్గాలను శరద్ పవార్ నుండి లాక్కోవడం అయినా ఆ తర్వాత బీజేపీతో, మరోసారి ఆర్జేడీతో ఇలా ఏం చేసినా సంచలనమే. ఇక ముఖ్యంగా పాలనలో కులగణన చేపట్టినా, మద్య పాన నిషేధం అమలు చేసినా నితీశ్ శైలే వేరు.

మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుని తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 9వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా దేశంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలతో నితీశ్‌ పోటీ పడుతున్నారు. 17 ఏళ్ల 158 రోజుల పాలనతో 11వ స్థానంలో ఉన్నారు

నితీశ్‌ కుమార్‌ కన్నా ఎక్కువ కాలంపాటు ముఖ్యమంత్రులుగా పని చేసిన 10 మందిలో 9 మంది ఐదుసార్లు సీఎంగా ప్రమాణం చేయగా, మాణిక్‌ సర్కార్‌ నాలుగు సార్లే ప్రమాణం చేశారు. నితీశ్‌ మాత్రం 9 సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

నితీశ్‌ కుమార్‌ది ఓ విధంగా అదృష్టనే చెప్పాలి. ఆర్జేడీకి 79,బీజేపీకి 78,జేడీయూ 45 స్థానాలు గెలవగా చక్రం తిప్పుతున్నారు నితీశ్. సొంతంగా మెజార్టీ సాధించకపోయినా కింగ్ మేకర్‌గా నిలిచారు.

Also Read:చికెన్ లివర్.. తింటే ఏమౌతుంది?

- Advertisement -