బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్ని రోజులుగా మహాకూటమిలో విభేదాలు తలెత్తడంతో నితీష్ కుమార్ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందంటూ దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. గతంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆర్జేడీ మరియు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. ఇక ఆ తర్వాత బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆర్జేడీ తోఉన్న విభేదాల కారణంగా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చే దిశగా నితీష్ కుమార్ అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి.
అయితే తాము ఇండియా కూటమిలోనే ఉన్నామని జేడీయా పార్టీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అయితే సీట్లో సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేసుకోవాలంటూ జేడీయు పార్టీ పరోక్ష విమర్శలు గుప్పించడం కొత్త చర్చకు తావిచ్చింది. సీట్ల పంపకల్లో అసంబద్ధత నెలకొన్న కారణంగానే ఇటు ఆర్జేడీ తోను కాంగ్రెస్ తోను నితీష్ కుమార్ విభేదిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ తో చేతులు కలిపిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. ఒకవేళ అదే గనుక జరిగితే ఎన్నికల ముందు ఇండియా కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లేనని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ జేడీయూ అధినేత నితీష్ కుమార్ వ్యవహారం ఇటు ఇండియా కూటమిలోనూ అటు మహా కూటమిలోనూ ఆందోళన కలిగిస్తుంది. మరి ముందు రోజుల్లో నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఇండియా కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:బాబీ డియోల్…’కంగువ’ లుక్