విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఈ సినిమాకు మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ ఖరారు చేయగా ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా సినిమాకు సంబంధించి కీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న ఫస్ట్ ఛార్జ్ అంటూ ఆసక్తికరమైన పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ తో ఇద్దరు కథానాయికల కలయిక ఇదే తొలిసారి.
పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్ తో కలిసి పనిచేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.