నితిన్ బ‌ర్త్ డే..”రంగ్ దే” మోష‌న్ పొస్ట‌ర్ విడుద‌ల‌

281
- Advertisement -

యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా భీష్మ నిలిచింది. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రంలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టించింది. ఈమూవీ త‌ర్వాత నితిన్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రంగ్ దే మూవీలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. ఈమూవిలో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

రేపు నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా నితిన్, కీర్తి సురేష్ మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ద‌స‌రాకు ఈమూవీని విడుద‌ల చేసుందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -