తెలంగాణ బీజేపీ నేతలకు షాకిచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బండి అండ్ బ్యాచ్ బట్టలు చింపుకుంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని ఆ పార్టీకి చెందిన మంత్రే సమాధానం ఇచ్చిన అబద్దపు, విషపు ప్రచారంతో కాలం వెల్లదీసుకుంటూ వస్తున్న బీజేపీ నేతలకు గడ్కరీ షాకిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోరిన వెంటనే కేంద్రం అనుమతులు ఇచ్చిందని ….ఈ విషయంలో యావత్ భారత్.. హైదరాబాద్ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వంపై ఇన్ని రోజులు తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ శ్రేణులు డిఫెన్స్‌లో పడ్డాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో బీజేపీకి భారీ దెబ్బ పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాళేశ్వరంతో కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు కట్టడం తప్ప ప్రజలకు చేకూరే లబ్ధి ఏమాత్రం లేదని..సీఎం ఫామ్‌హౌజ్‌కే నీళ్లు వచ్చాయని ఆరోపించిన బండి..నితిన్ గడ్కరీ వ్యాఖ్యలకు ఏ సమాధానం చెబుతారో వేచిచూడాలి.