రివ్యూ : చెక్

536
check
- Advertisement -

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్ర‌సాద్ నిర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చెక్ ముందుకు రాగా సినిమాతో నితిన్ ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం…

కథ :

ఆదిత్య(నితిన్) టెర్రరిస్టులకు సహాయం చేసినందుకు గాను అతనికి జీవిత ఖైదు చేస్తారు. ఆదిత్య కేసుని లాయర్ మానస వాదిస్తుంది. అప్పటికే జీవితం మీద ఆశ కోల్పోయిన ఆదిత్య, మానస కేసు టేకప్ చేయడంతో ఆశ కల్పిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యపై దేశద్రోహి అనే నింద ఎలా పడింది..? ఫ్లాష్ బ్యాక్ లో ఆదిత్య లవ్ స్టోరీ ఏంటీ..? ఆదిత్య కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో గ్రాండ్ మాస్టర్ గా టైటిల్ ఎలా గెలచుకున్నాడు..చివరకు ఎలా నిర్దోషిగా మిగిలాడన్నదే సినిమా కథ..

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ నితిన్,రకుల్,కథ,స్క్రీన్ ప్లే. ఇప్పటివరకు చేయని పాత్రలో నటించి మెప్పించారు హీరో నితిన్. కథకు తగ్గట్టుగా అద్భుత పర్ఫామెన్స్‌తో నితిన్ ఆడియన్స్‌ని ఆకట్టుకోగా లాయర్ పాత్రలో ఒదిగిపోయింది రకుల్. తన పాత్రకు వందశాతం న్యాయం చేస్తూ మెప్పించింది. మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్. కథ బాగున్నా సెకండాఫ్‌పై దర్శకుడు కాస్త దృష్టి సారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. స్క్రిన్ ప్లే అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చంద్రశేఖర్ ఏలేటి లాంటి దర్శకుడి నుండి ఎలాంటి సినిమా వస్తుందనుకుంటారో అలాంటి సినిమానే ప్రేక్షకులకు అందించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

లాక్ డౌన్‌ తర్వాత చెక్‌తో వచ్చిన నితిన్ ప్రేక్షకులను మెప్పించడంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. రోటిన్ కథలకు భిన్నంగా వచ్చిన ఈ మూవీ వీకెండ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుందనే చెప్పుకోవచ్చు.

విడుదల తేదీ: 26/02/2021
రేటింగ్: 2.75/5
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్
సంగీతం: కళ్యాణ్ మాలిక్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్

దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటీ

- Advertisement -