వెంకీ కి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన నితిన్‌..!

321
hero nithin
- Advertisement -

ఈ రోజు టాలీవుడ్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఓ ఖరీదైన గిఫ్ట్‌ అందుకున్నాడు. అయితే ఆ గిఫ్ట్‌ ఇచ్చింది మరెవరో కాదు టాలీవుడ్‌ యూత్‌ స్టార్‌ హీరో నితిన్‌. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ‘భీష్మ’తో తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకు నితిన్ ఖరీదైన రేంజ్ రోవర్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు స్వయంగా వెంకీ ఇంటికి వెళ్లి, కారును ఇచ్చిన నితిన్, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక ఈ రేంజ్ రోవర్ కారు ధర సుమారు రూ. 1 కోటికి పైగానే ఉంటుంది. ఇంత ఖరీదైన కారును తనకు గిఫ్ట్ గా ఇవ్వడంపై వెంకీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “మంచి వారితో మంచి సినిమాలు చేస్తే, ఫలితం ఇలానే ఉంటుంది. అత్యుత్తమ బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు” అంటూ వెంకీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

- Advertisement -