నితిన్…25..రిలీజ్ డేట్ ఖరారు

208
Nithin 25th Movie First Look
- Advertisement -

లై పరాజయంతో డీలాపడిపోయిన నితిన్ తన నెక్ట్స్ సినిమాపై విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. నితిన్ 25వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ క‌థానాయిక‌గా న‌టిస్తోండగా…. సీనియ‌ర్‌ న‌టి లిజి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది.

కాగా ఇంకా టైటిల్‌ ఖరారు కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను నితిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌స్తావించారు. ఈ నెల 12న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను, 14న టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నామ‌ని.. ఏప్రిల్ 5న సినిమాని విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు.

ఈ సినిమాకి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉండగా, ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని మేఘా ఆకాశ్ ఆశపడుతోంది.

- Advertisement -