టాలీవుడ్ యూత్‌స్టార్ నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడాయి. నితిన్ – కీర్తి జోడీ బాగుందనే టాక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రిలీజయ్యాక హిట్ టాక్ వచ్చింది కాని, కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్ళు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీని ఓటీటీ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాని జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘రంగ్ దే’ ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఇందులో నభా నటేష్ హీరోయిన్‌గా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.