ఆసక్తిరేపుతున్న నితిన్‌ ‘మాస్ట్రో’ ట్రైలర్‌..

28
Maestro Trailer

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ చిత్రంగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మాస్ట్రో. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.

ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించేలా ఉంది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. నాయికల అందం కనువిందు చేస్తోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.

Maestro | Official Trailer | Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta | Coming Soon