అనుష్క ‘నిశ్శబ్ధం’ అప్పుడే..!

88
anuskha

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో అనుష్క నటిస్తోంది.

పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Nisabdham Movie

 

అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి.. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలకమైన పాత్రను పోషించాడు. ‘భాగమతి’ తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు వున్నాయి.

Nishabdham ( transl. Silence) is an upcoming Holywood Crossover thriller film directed by Hemant Madhukar. The film starring Anushka Shetty as lead role …