ఈసారి కూడా ‘పేపర్ లెస్’ బడ్జెట్

14
- Advertisement -

కేంద్రబడ్జెట్ ను ఈసారి కూడా పేపప్‌ లెస్‌గానే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర కేబినెట్ సమావేశం జరుగగా బడ్జెట్‌ను మంత్రిమండలి అమోదించింది. బడ్జెట్ కాఫీలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. సభ్యులకు బడ్జెట్ కాఫీలను అందజేస్తారు. అదే విధంగా డిజిటల్ రూపంలో పీడీఎఫ్‌ కాపీని సభ్యులకు షేర్ చేస్తారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టనున్నారు. గతంలో పేపర్ల ద్వారా బడ్జెట్ లోక్‌సభకు సమర్పించగా.. కొన్నేళ్లుగా డిజిటల్ విధానంలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం ఉన్న టాబ్లెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు చూపించారు. ఎరుపు రంగు కలిగిన క్లాత్ బ్యాగ్‌తో నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకుంటారు.

బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్‌ లాభాలతో ప్రారంభమైంది. బడ్జెట్ సమర్పణకు ముందు 229.89 పాయింట్లు పెరిగి 80,731.97 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:జన సైనికులకు భద్రత.. క్రియాశీలక సభ్యత్వం

- Advertisement -