- Advertisement -
స్వీస్ బ్యాంక్ డిపాజిట్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020తో పోల్చితే 2021లో విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనం పెరిగిపోతుందన్న మీడియా కథనాలు వాస్తవానికి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల్లో రూ.14,820 కోట్ల పన్ను బకాయిలు వెల్లడయ్యాయని పార్లమెంట్‌కు తెలిపారు.
స్విట్జర్లాండ్, విదేశాల్లో డిపాజిట్ చేసిన భారతీయులందరి సంపద నల్లధనం (అప్రకటితమైంది) అని మీడియా సహా చాలా మందిలో సాధారణ అభిప్రాయం ఉందని వెల్లడించారు.
- Advertisement -