ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్,సోమశిల

3
- Advertisement -

2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పర్యాటక గ్రామం “క్రాఫ్ట్స్” కేటగిరీలో నిర్మల్ జిల్లా నిర్మల్, “స్పిరిచ్యువల్ – వెల్నెస్ ” కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామాలు ఎంపిక చేసింది.

ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో “భారత ఉపరాష్ట్రపతి “జగ్దీప్ ధన్కడ్” ముఖ్య అతిధిగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,నిర్మల్ టాయ్స్,ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య.సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా అవార్డులు అందుకున్నారు.

Also Read:గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా: బుర్రా శ్రీనివాస్

- Advertisement -