GIC:హరితహారంలో నిర్మల్ బీఆర్ఎస్ నాయకులు

8
- Advertisement -

హరిత ప్రేమికుడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం పది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల ఆడెల్లి మహా పోచమ్మ ఆలయ అవనలో మొక్కలు నాటారు నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి K రామ్ కిషన్ రావు మరియు హరిత సేన జిల్లా అధ్యక్షులు అశోక్ రాథోడ్ నాయక్ ఆలయ కమిటీ చైర్మన్ భోజగౌడ్.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ గారు తను చేపట్టిన పథకాల్లో ఎంతో ఇష్టమైన ఇ హరిత హారం పథకం తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చింది తెలంగాణ అంతటా పచ్చధనంతో ఉండాలని భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మొక్కలు నాటారు పది సంవత్సరాలు క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలు అయ్యాయి అన్నారు.

పల్లెలు పట్టణాలు తేడా లేకండా రోడ్డు ఇరువైపుల నాటడంతో ఎక్కడ చూసిన పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు మానవ మనుగడకు చెట్లే ముఖ్యమని భావించి గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమం ద్వారా కూడా కోట్ల మొక్కలు నాటారు అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఇ హరిత హారం కార్యక్రమాన్ని హరిత సేన ద్వారా కొనసాగించాలని కోరుకుంటున్నాం ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ బోజనారాయణ, దుబాయ్ రాజన్న,ఎలాల చిన్నరెడ్డి,తోడిశెట్టి సుదన్, మరియు దిల్వార్ పూర్ నర్సాపూర్ మండలాల కన్వీనర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సారంగాపూర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు.

Also Read:విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్

- Advertisement -