నిర్బయ కేసు: ఉరిపై స్టే ఇవ్వండి

391
nirbaya case
- Advertisement -

ఉరిపై స్టే ఇవ్వాలని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు నిర్బయ నిందితులు. తమ ఉరిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది న్యాయస్ధానం.

మరోవైపు, నిర్భయ దోషి అక్షయ్ కుమార్ దాఖలుచేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తన ఉరిశిక్షను యావజ్జీవత ఖైదుగా మార్చాలని కోరుతూ అక్షయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని రెండోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -