నాని… `ట‌క్ జ‌గ‌దీష్‌` ప్రారంభం

438
nani hero
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రానికి `ట‌క్‌…జ‌గ‌దీష్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన టక్ జగదీష్ మూవీ ఇవాళ ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కు దిల్ రాజు క్లాప్ కొట్టగా, కొరటాల శివ బౌండెడ్ స్క్రిప్ట్ అందించారు. నిర్మాత నవీన్ కెమెరా స్విచాన్ చేశారు. ఫిబ్రవరి 11 నుంచి పొలాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ ఏడాది `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని హంగుల‌తో ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందించ‌నున్నారు. `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

- Advertisement -