నా బ్రాండ్ ఇమేజ్ ధ్వంసమైంది-మోదీ

214
Nirav Modi, In Letter, To Punjab National Bank
- Advertisement -

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం మారిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యుత్సాహం వల్లే తమ కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చిందని నీరవ్ మోదీ ఆరోపించారు.

పీఎన్‌బీ స్కామ్ బయటపడక ముందే నీరవ్ మోదీ ఆ బ్యాంక్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పీఎన్‌బీ వైఖరిని తప్పుపట్టారు. పీఎన్‌బీ అత్యుత్సాహాం వల్లే తాము రుణాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని ఆ లేఖలో నీరవ్ ఆరోపించారు. బ్యాంక్‌కు తాము బాకీ ఉన్న రుణాల కన్నా ఎక్కువగా లెక్కల్లో చూపించారని నీరవ్ విమర్శించారు. కుంభకోణంతో సంబంధం లేని తమ బంధువులను కూడా ఆ కేసులో ఇరికించారని నీరవ్ తెలిపారు.

Nirav Modi, In Letter, To Punjab National Bank

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఈనెల 15వ తేదీన ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది. సుమారు 5000 కోట్లు మేరకు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారన్న నీరవ్‌పై ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు లెక్కలు మీడియాను ఆకర్షించాయని, దాని వల్ల తమ కంపెనీ ఆపరేషన్స్ మూతపడ్డాయని, దాంతో ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ పనులు నిలిచిపోయాయని నీరవ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ కారణంగా తాము తమ రుణాలను తీర్చలేని స్థితికి చేరుకున్నట్లు ఆయన ఆరోపించారు. గడువు కోరినా, బ్యాంకు తొందరపాటు చేసిందని, దాని వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ కూడా ధ్వంసమైందన్నారు. బ్యాంకు అధికారులు, ప్రతినిధులతో నీరవ్ చేపట్టిన చర్చల గురించి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -