విత్తనరంగంలో పెట్టుబడులు పెట్టండి: నిరంజన్‌ రెడ్డి

451
niranjan reddy
- Advertisement -

విత్తనోత్పత్తికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రదేశం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. యూరప్ విత్తన కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. నాణ్యమైన విత్తనంతోనే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని… ఆసియా ఖండపు ప్రాంతీయ సీడ్ హబ్ గా భారత్ ఎదగాలి దానిలో తెలంగాణ పాత్ర కీలకం అన్నారు.

తెలంగాణ లో విత్తన రంగ అభివృద్దికి ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగిందని.. OECD అంతర్జాతీయ విత్తన దృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదారాబాద్ లో ISTA విత్తన పరీక్ష ల్యాబ్ ను ప్రారంభించబోతున్నాం అన్నారు.

niranjanreddy

గత జూన్ మాసం లో ఆసియా ఖండంలోనే మొదటి సారి 800 మంది విదేశీ విత్తన ప్రముఖులతో అంతర్జాతీయ ISTA విత్తన సదస్సు నిర్వహించాం.. తెలంగాణలో విత్తనరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలో ISTA వారు హైదరాబాద్ నగరానికి ఈ అవకాశం ఇచ్చారని చెప్పారు.

ఆసియా ఖండం లో మొదటి సారిగా తెలంగాణ నుంచి అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ISTA) వైస్ ప్రెసిసెంట్ గా డా. కేశవులు ఎంపిక కావడం గమనార్హం అన్నారు. యూరప్ కంపెనీలు చైనా విత్తన రంగం లో పెట్టుబడులు పెడుతున్నాయి… తెలంగాణ రాష్ట్రం లో నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన ప్రాసెసింగ్ కు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

హైబ్రిడ్ విత్తనోత్పత్తి లో అనుభవం, నైపుణ్యం కలిగిన విత్తన రైతులు ఉన్నారు.. తెలంగాణ ప్రభుత్వం విత్తన రంగ అభివృద్దికి పలు సంస్కరణలు చేపడుతుంది .. విత్తన కంపెనీలకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన విత్తనాన్ని తెలంగాణ లో ఉత్పత్తి చేయవచ్చు తద్వారా తెలంగాణ విత్తన రైతుల ఆదాయం రెట్టింపు అయ్యి, లాభం చేకూరుతుందన్నారు.

ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టులో భాగంగా జర్మనీ దేశ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ప్రతినిధి బృందం వెళ్లింది. మూడో రోజు పర్యటనలో భాగంగా బోన్ పట్టణంలో జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ మరియు యూరప్ విత్తన కంపెనీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు.

niranjanreddy

అభివృద్ది చెందుతున్న దేశాల విత్తన పరిశ్రమలతో పోటీపడుతూ భారత్ దాదాపు 15 వేల కోట్ల విలువని కలిగి ఉండి ఆసియా ఖండం లో అత్యున్నత స్థానం లో ఉందని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ తెలిపింది. ఆసియా ఖండపు రీజినల్ సీడ్ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్య పాత్ర పోషించాలన్నారు.

భారత్‌లో సాదారణ పంటల విత్తనోత్పత్తిలోకాకుండా, కూరగాయ పంటల విత్తనోత్పత్తిలో మంచి అవకాశాలు ఉన్నాయి .. విత్తన చట్టాలు, నాణ్యతా నియంత్రణ విధానం మెరుగుపరచి విత్తన పరిశోదన పై కూడా మరింత దృష్టి సారించాలని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

- Advertisement -