Niranjan:బీఆర్‌ఎస్‌ను ఎవరూ టచ్‌ చేయలేరు

18
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీని ఎవరూ టచ్ చేయలేరన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు స్పూర్తి అని తెలిపారు.

వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నిరంజన్… ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా రాజకీయ ప్రలోభాలకు తెరతేసి అభ్యర్థిని నిలిపిన ఘనత రేవంత్ రెడ్డిదని విమర్శించారు. 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, 14 ఏండ్ల పోరాట పటిమ, 10 ఏండ్లు అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, అంతమాత్రాన ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తాం, బొంద పెడతాం అనడం సరికాదన్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని చెరిపేయాలన్న కుట్రను ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు.

Also Read:రాష్ట్రాన్ని తాకిన నైరుతి..

- Advertisement -