Niranjan Reddy:రైతులను రోడ్లపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్

8
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్లపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు సమస్యలతోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. రుణమాఫీతో రైతుల ఆశలు ఆవిరి అయ్యాయని… తప్పుడు లెక్కలతో రుణమాఫీ చేయకుండా మాయ చేస్తున్నారని ఆరోపించారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడిన నిరంజన్ రెడ్డి..ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్నారు. ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గెలిచాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

రైతులు తీసుకున్న రుణాలు, చేసిన మాఫీకి, ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎలాంటి పొంతన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు నేడు గుర్తిస్తున్నారని చెప్పారు. రైతులే రుణమాఫీపై మాట మారుస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు మెడలు వంచుతారన్నారు. రైతుల ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read:బీఆర్ఎస్ ధర్నాలకు తరలివచ్చిన రైతులు..

- Advertisement -