సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని … కిషన్ రెడ్డికి ఎద్దులు లేవు.. బండి సంజయ్‌కి బండి లేదని ఎద్దేవా చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రైతు ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ఐక్యమత్యంగా ఉంటే రైతులదే అంతిమ విజయం అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, కేంద్ర అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని, ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడం లేదని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాలకు వెళ్లి బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అన్ని సీజన్లలో వరి పండుతుందని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు.