రైతుబంధు సమితులు కీలకంగా పనిచేయాలి..

199
Niranjan Reddy
- Advertisement -

హైదరాబాద్ గురువారం రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు సమితులు రైతాంగం గొంతుక వినిపించాలి. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతుబంధు సమితులు కీలకంగా పనిచేయాలి అన్నారు.

ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.డిమాండ్ ఉన్న పంట వేస్తేనే ఆదాయం వస్తుందని రైతులను ఒప్పించండి. అడగక ముందే కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చారు. రైతులను రాజులను చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర వ్యవసాయ ప్రణాళికను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలు దొరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -