రంగారెడ్డిలో ప్రారంభం కానున్న బస్తీ దవాఖానాలు..

301
Basti dawakhana
- Advertisement -

రాష్ట్రంలోని నిరుపేదల చెంతకే వైద్య సదుపాయాలను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా శుక్ర వారం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు బస్తీ దవాఖానాలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఐదు నుండి పది వేల మందికి స్థానికంగానే వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్స, మందుల సరఫరా, ల్యాబ్ సదుపాయాలు తదితర సేవలను ఈ బస్తీ దవాఖానల ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో గురువారం నాడు 43 బస్తి దవాఖానాలు ప్రారంభం కానుండగా వీటిలో ఐదు బస్తి దవాఖానాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి.

రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో బస్తి దవాఖాన, సాహేబునగర్ వైదేహీనగర్‌లో,సరూర్నగర్ పరిధిలోని లింగోజిగూడ అధికారి నగర్‌లో, లింగోజిగూడ వార్డ్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలోని కామేశ్వర రావు నగర్ కాలనీలో, కొండాపూర్ వార్డ్ పరిధిలోని మసీద్ బండ ప్రేమ్ నగర్ కమ్యూనిటీ హాల్ లలో ఈ కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసారు.ఈ బస్తి దవాఖానాలను శుక్రవారం నాడు మంత్రులు, శాశన సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.

బుద్వేల్, డాక్టర్స్ కాలనీ కామేశ్వర రావు నగర్ లలోని బస్తీ దవాఖానాలు రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభిస్తుండగా, సరూర్ నగర్ అధికారి నగర్, సాహేబునగర్ లోని వైదేహి నగర్ లలోని బస్తి దవాఖానాలను ఎల్.బీ. నగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, కొండాపూర్ ప్రేమ్నగర్ కమ్యూనిటీ హాల్ లోని దష్టి దవాఖానను శాసన సభ్యులు అరికెపూడి గాంధీ లు ప్రారంభిస్తారు.ఈకార్యక్రమాలకు సంబంధిత ఎంపీలు,ఎమ్మెల్సీలను,కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది.

బస్తి దవాఖానాలలో అందుబాటులో ఉండే వైద్య సేవలివే..

న్యూ ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లు పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో ఇదే మాదిరిగా బస్తి దవాఖానల పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లోనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలు నడుస్తుండగా రేపు మరో 43 బస్తి దవాఖానాలు ప్రారంభం కానున్నాయి. ఈ బస్తి దవాఖానాల్లో అవుట్ పేషంట్ కన్సల్టేషన్, టెలి మెడిసిన్ సదుపాయం, రక్త, మూత్ర పరీక్షలు లాంటి కనీస ల్యాబ్ డయాగ్నోసిస్ సదుపాయం, ఇమ్మ్యూనైజేషన్, యాంటి నాటల్, పోస్ట్ నాటల్ కేర్,అనీమియా పరీక్షలు, రక్తపోటు, బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహిస్తారు.

- Advertisement -