ఆర్‌ఎస్పీ గెలుపుకోసం కృషి చేద్దాం:నిరంజన్‌

21
- Advertisement -

నాగర్ కర్నూలు బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ను ఎంపిక చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆర్ఎస్పీ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం అన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందన్నారు.

వంద రోజుల కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం అని…రుణమాఫీ అటకెక్కింది .. రైతుభరోసా ఆగిపోయిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి పథకాల ఊసెత్తడం లేదని..కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

సాగునీళ్లు ఆగిపోయాయి .. తాగునీళ్లకు కరువొచ్చిందని..రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు .. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతుందన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ భీడు భూములతో దర్శనమిస్తుందన్నారు. కరంటు కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారు .. అర్దరాత్రి కరంటు కోసం రైతులు నిద్దుర కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని… బీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలం .. నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దాం అన్నారు.

Also Read:100 రోజుల పాలన.. ఎలా ఉంది?

- Advertisement -