శ్రీధర్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలి!

20
- Advertisement -

కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్ రెడ్డి (45)ని గుర్తు తెలియన వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్పందించిన నిరంజన్ రెడ్డి…శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాజకీయంగా చెదురుమొదురు సంఘటనలు తప్ప, ఒక్క హింసాత్మక చర్యగానీ, హత్యలుకానీ జరగలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ద్వేషాలను వ్యక్తిగత ద్వేషాలుగా తీసుకొని హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేదని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యం కొల్పోవద్దని నిరంజన్‌ రెడ్డి సూచించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడానని, హత్య చేసిన వారిని, హత్యకు ప్రోత్సహించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరానని ఆయన తెలిపారు.

Also Read:గ్లాసు పాలలో చిటికెడు గసగసాలు..!

- Advertisement -