రాష్ట్రంలో వ్యవసాయానికే అధిక ప్రాముఖ్యత..

470
minister niranjan reddy
- Advertisement -

నాంపల్లి రెడ్ హిల్స్ లో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో విత్తన సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్ స్పైస్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ పాల్గొన్నారు. అలాగే ఈ సదస్సుకు నిర్మల్, వికారాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుండి రైతులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్యాలు చాలా ఉపయోగకరమైన పంటలు. చలి కాలంలో ఈ పంట వేస్తే బాగుంటుంది.సుగంధ ద్రవ్యాలలో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సుగంధ ద్రవ్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వీటిని ప్రపంచంలో ఎక్కువ పండించే దేశం మన దేశమని..రాష్ట్రమంతటా దిగుబడి ఎక్కువ వచ్చే ఈ సుగంధ ద్రవ్యాలను పండించాలని పార్థసారథి అన్నారు.

ఈ పంటల ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. తక్కు ఖర్చులో ఎక్కువ దిగుబడి వస్తుంది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మా వ్యవసాయ శాఖ అందిస్తుంది. మీరు విజయం సాధించి ఎక్కువ ఆదాయం పొందాలి అప్పుడు మిగతా రైతులను పిలిపించి మీతో వారికి అవగాహన కల్పిస్తాం.కాళేశ్వరం ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాయి నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడు ఒకే పంట వెయ్యడం వలన భూమి సారవంతం కోల్పోతుంది.మీరు రాష్ట్ర రైతులకు ఆదర్శంగా నిలవాలి. అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు.

niranjan reddy

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రకరకాల వంటలు అనేక రకాల దినుసుల ద్వారా చేస్తేనే బాగుంటుంది. ఈ సుగంధ ద్రవ్యాలు సమశితోష్ణ ప్రాతంతల్లో పండే అవకాశం ఉంటుంది. ఆసియ ఖండంలో ఎక్కువగా ఇలాంటి పంటలు ఎక్కువ సాగు అవుతాయి.అప్పట్లో వస్తూ మార్పిడి మాత్రమే ఉండేది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించాలి. ప్రపంచంలో ఎక్కడకు అయిన ఎగుమతి చేయవచ్చు అని మంత్రి అన్నారు.

అన్ని దేశాల్లో అన్ని పంటలు పండవు,అందుకే మన రాష్ట్రంలో పండే పంటలు పండించాలి.సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంను కొరబోతున్నాం. మీరు పంట పండించిన తరువాత పంటను మార్కెట్ చేసే బాధ్యత మాదే. ఎరువులు,ఇతర ముడి సరుకులు సబ్సిడీ ఇస్తాం. నేను కూడా ఈ పంటలను వేస్తాను నా అనుభవం కూడా మీతో పంచుకుంటానని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పండిన పంట మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. పత్తి పంటలో అంతర్ పంటగా కొత్తిమీర వేస్తే ఒక్క ఎకరంలో 60 వేల రూపాయల ఆదాయం వచ్చింది అని రైతు చెప్పడం గొప్పగా అనిపించింది. రాష్ట్రంలో అధిక ప్రాముఖ్యత ఉన్న రంగం వ్యవసాయ రంగం.ప్రపంచ వ్యాప్తంగా ఆర్గానిక్ పంటల వైపు పోతుంది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మనం పంటలు పండించాలి. అప్పుడు మనకు లాభసాటిగా ఉంటుంది.

ప్రతి ఒక్క రైతు ఊరు కోళ్లను పెంచుకోవాలి. రైతుల కోసం ఎంత అయిన బరిస్తాం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులకు మేలుచేసే కార్యక్రమాలు చెయ్యాలి కానీ తగ్గిస్తే ఊరుకోరు. రైతులు గొప్పగా బ్రతికినప్పుడు మాత్రమే తెలంగాణ సాదించిన సార్థకత ఉంటుంది.అని మంత్రి తెలిపారు.

- Advertisement -