harish:నిమ్స్‌లో ఎంసీహెచ్‌ ఆసుపత్రి..!

53
- Advertisement -

తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిమ్స్‌కు అనుబంధంగా ఎర్రమంజిల్లో నిర్మించే 200పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఎంసీహెచ్‌ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొదటి సారిగా ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. గతంలో మూడు మాత్రమే ఉన్న ఆసంఖ్యను ఇప్పుడు 27కు పెంచామని ఇదంతా సీఎం కేసీఆర్‌ ఘనతే అని అన్నారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు మాతా మ‌ర‌ణాలు ప్ర‌తి ల‌క్ష‌కు 92 మ‌ర‌ణాలు ఉండే.. దాన్ని 43కు త‌గ్గించ‌గ‌లిగాం. ప్ర‌తి ల‌క్ష‌కు శిశు మ‌ర‌ణాలు 36 ఉంటే 21కి త‌గ్గించుకున్నాం అని తెలిపారు. మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. మొద‌టి స్థానానికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందన్నారు.

గాంధీలో 200పడకల సూపర్‌ స్పెషాలిటీ నిమ్స్ 200 పడకలు అల్వాల్లో మరో 200పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్‌కు రూ.55 కోట్లతో 4అంతస్థుల్లో 200పడకలతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా 34మంది కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి…

Harish Rao:మాతా శిశు మరణాలు తగ్గుముఖం

Harish Rao:బీఆర్ఎస్‌కు 100 సీట్లు

KTR:ఫ్లై ఓవ‌ర్ల కింద క్రీడా వేదిక‌లు..

- Advertisement -