హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా కలకలం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అంతా క్వారంటైన్‌కు వెళ్లాలని నిలోఫర్ సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా సిబ్బంది అందరూ క్వారంటైన్‌కు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే…నారాయణపేట్ జిల్లా అభంగాపూర్‌కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరం రావడంతో అతని తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్ అని తేలడంతో సూపరింటెండెంట్ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.