నిఖిల్ నిశ్చితార్థం ఆగిపోయిందా ?

184
AK Entertainment Production No11 with Nikhil
- Advertisement -

నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో పరిచయమై ఎంతగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హ్యాపీ డేస్‌ సినిమా తర్వాత విజయాలు లేక కొంచెం సతమతమైన ఈ కుర్ర హీరో స్వామి రారా నుంచి విజయాలను అందుకుంటున్నాడు. రీసెంట్ గా కేశవా సినిమాతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు హల్ చల్ చేశాయి.

నిఖిల్ కి హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపార వేత్త కూతురు ‘తేజస్విని’తో వివాహం జరగనున్నట్టు ,వీరి నిశ్చితార్థం ఈ నెల 24వ తేదీన జరుగుతుందని, అక్టోబర్‌ 1న ఈ ఇద్దరూ పెళ్లి జరగనుందని వార్తలు భయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జంట నిశ్చితార్థం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.

నిఖిల్ – తేజస్విని ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి చేసేద్దామని ఇరు కుటుంబాలవారు అనుకున్నారట. కానీ జాతకాలు కుదరకపోవడంతో ఇరు కుటుంబాలవారు మాట్లాడుకుని, నిశ్చితార్థం – పెళ్లి ఆలోచనను విరమించుకున్నట్టు చెబుతున్నారు. నిఖిల్ కోసం వాళ్ల బంధువుల్లోనే మరో అమ్మాయిని చూస్తున్నారట. పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో నిఖిల్‌ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.

- Advertisement -