బాలయ్య బీబీ3లో సిమ్రాన్‌!

270
simran

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లలో ఒకటి బాలకృష్ణ-బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహ,లెజెండ్ బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూడోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రానుండగా బీబీ3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బాలయ్య త్రిపాత్రాభినయం చేయనుండగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్యతో నరసింహనాయుడు చిత్రంలో నటించిన సిమ్రాన్‌ను ఈ మూవీలో తీసుకోనున్నారట.

సిమ్రాన్ పాత్ర సినిమాలో కీలకం కానుండగా కథ వినగానే ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యువ హీరో నవీన్ చంద్ర ఎమ్మెల్యేగా నటించనున్నాడని టాక్‌. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.