మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో సత్తాచాటింది నిఖత్ జరీన్. అంచనాలకు తగ్గట్టుగానే ఆడి రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. నిఖత్ పంచ్‌లోని వేగం ముందు ఇన్‌గ్రిట్ తట్టుకోలేకపోయింది.
అలాగే 48 కేజీల నుంచి నీతు గాంగాస్, 75 కేజీల విభాగంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించగా 2014 తర్వాత సవీటి బోరా (81కేజీ) మరోసారి ఫైనల్ చేరింది.
మరో సెమీస్‌లో లవ్లీనా 4-1తో మాజీ చాంపియన్ లి క్వియాన్ (చైనా)ను ఓడించగా..ఆఖరి సెమీస్‌లో సవీటి బూరా 81కేజీల విభాగంలో 4-3తో సూ ఎమ్రా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)ని ఓడించింది. ఫైనల్స్‌లో గుయెన్ తి టామ్ (వియ త్నాం)తో నిఖత్ జరీన్, కైక్లిన్ పార్కర్ (ఆస్ట్రేలి యా)తో లవ్లీనా, వాంగ్ లి నా (చైనా)తో సవీటి, లుక్సైఖాన్ (మంగోలియా)తో నీతు అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..