పూరి తమ్మునితో పవన్ హీరోయిన్‌ రొమాన్స్‌..

426
Nikesha Patel To Romance Sairam Shankar
- Advertisement -

పవన్‌తో కోమరంపులి సినిమాలో మెప్పించిన బ్యూటీ నికిషా పటేల్. తర్వాత సినిమాల్లో అవకాశం రాకపోయిన….కొంతకాలం గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్మునితో రొమాన్స్‌ చేసింది. పూరి తమ్ముడు రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది .

Nikesha Patel To Romance Sairam Shankar

దర్శక ,నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల “మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాద్ గారు, మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది. సినిమా చూసిన వారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది . అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 30 ఇయర్స్ పృద్వి చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దుతో సినిమా ధియేటర్ లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినప్పటికీ మా సినిమా “అరకు రోడ్ లో “మీద వున్న నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 న అత్యధిక ధియేటర్ లలో రిలీజ్ చేయనున్నాము అని అన్నారు .

Nikesha Patel To Romance Sairam Shankar

ఈ సమావేశం లో హీరో రాం శంక‌ర్‌, హీరోయిన్ నికిషా ప‌టేల్, దర్శకుడు వాసుదేవ్ ,మేకా బాల సుబ్రహ్మణ్యం ,మేకా సింహాద్రి ,వేగిరాజు ప్రసాద రాజు ,విజయ్ నక్కా ,కెమెరా మాన్ జగదీశ్ చీకటి పాల్గొన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్

- Advertisement -