పవన్‌…పావలా కల్యాణ్‌..!

431
pawan

సెప్టెంబర్ 2…జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ పవన్‌ పాటలను షేర్ చేస్తూ…బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే పవన్‌తో పనిచేసిన ఓ భామ తెలియకుండా చేసిన తప్పుకు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.

పవన్‌తో కొమరంపులి సినిమాలో నటించిన నికీషా పటేల్ తన మత్తెక్కించే అందాలతో కుర్రకారును ఫిదా చేసింది. పవన్‌కు ధీటుగా ఈ మూవీలో నటించిన నికీషా ట్విట్టర్ వేదికగా కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్పింది.

అయితే ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను ఆమె పెట్టింది. అందులో ‘హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా పెట్టింది. నికీషా అది కావాలని చేయనప్పటకీ.. పవన్ ఫ్యాన్స్‌ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తూ చుక్కలు చూపించారు.

ఫ్యాన్స్ ట్రోలింగ్‌ తట్టుకోలేక ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఎవరైనా హర్ట్ అయితే సారీ తప్పును సరిదిద్దుకున్నా. హ్యాపీ గణేషా.. #PSPK #pawankalyan అంటూ ట్వీట్ చేసింది. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది.