నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీగా కవిత భర్త?

375
mp kavitha husbend
- Advertisement -

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొంత మందికి సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లభించకపోవచ్చన్నది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆ లిస్ట్ లో ఇప్పటికే 4గురు ఎంపీల పేర్లు వినబడుతుండగా..తాజాగా మరో ఎంపీ పేరు వినిపిస్తుంది. ఆ ఎంపీ ఎవరో కాదు సీఎం కేసీఆర్ కూతురు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. కవిత ను ఈసారి పార్లమెంట్ లోకి కాకుండా అసెంబ్లీలోకి పంపించాలనే యోచనలో ఉన్నారట గులాబీ బాస్. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో పార్టీ నేతలతో చర్చించినట్టు సమచారం.

నిన్న జరిగిన నిజామాబాద్ సభలో కవిత అభ్యర్ధిత్వాన్ని కూడా ఖారారు చేయకపోవడం కూడా ఈప్రశ్నలకు తావిస్తుంది. కవిత స్ధానంలో ఆమె భర్త అనిల్ కు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట సీఎం కేసీఆర్. పైగా అనిల్ స్వస్ధలం నిజామాబాద్ జిల్లా కావడంతో ఇక్కడి నుంచే అనిల్ బరిలోకి దింపాలని చూస్తున్నారట. కవితను కెబినెట్ లోకి తీసుకుని నిజామాబాద్ పార్లమెంట్ స్ధానం నుంచి అల్లుడు అనిల్ ను పోటీ చేయించాలని భావిస్తున్నారట. రేపు ప్రకటించే లోక్ సభ అభ్యర్దుల జాబితా కోసం పార్టీ సినీయర్ నేతలతో ప్రగతిభవన్ లో సమాలోచనలు చేస్తున్నారు గులాబీ బాస్. ఇదే జరిగితే మరి కవితను ఎమ్మేల్యేగా పోటి చేయిస్తారా లేక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారో చూడాలి మరి.

- Advertisement -