- Advertisement -
నైజిరియాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది తుపాకీతో పాటు బాంబులు విసరడంతో 50 మంది మృతిచెందారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. ఓవో చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని వెల్లడించారు అధికారులు.
- Advertisement -