అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ వార్ పట్ల భయాలను పెంచాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల నుండి పెట్టుబడిదారులు నిష్క్రమించడం మొదలుపెట్టారు. దీంతో నిఫ్టీ కనిష్టానికి అంటే 900 పాయింట్లకు పతనమైంది.సెన్సెక్స్ 3వేలకు పైగా పాయింట్లు నష్టాన్ని చవిచూసింది. ఆసియా మార్కెట్లు పూర్తిగా ఎర్ర రంగులో ట్రేడ్ అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా పతనమయ్యాయి.
గత వారం సుమారు 6 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నష్టపోగా జపాన్ నిక్కీ 7.8 శాతం పడిపోయి 2023 చివరిలోని కనిష్ఠ స్థాయిలకు చేరింది. దక్షిణ కొరియా 4.6 శాతం కోల్పోయింది. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీ మరియు తైవాన్ సూచీలు 10 శాతం పతనమయ్యాయి.
అయితే ఇంత నష్టాలు వస్తున్నా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. కొన్నిసార్లు పరిష్కారం కోసం మందు తాగాల్సి వస్తుంది అని మాట్లాడటం విశేషం. ఇక గత వారం, సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 రెండూ 2.6 శాతం చొప్పున పడిపోయాయి. నిఫ్టీ 23,000 మార్క్ క్రిందకు పడిపోతూ 22,904 వద్ద ముగిసింది.2020 మార్చి తర్వాత నిఫ్టి ఈ రేంజ్ లో నష్టాన్ని చవిచూడటం ఇదే తొలిసారి.
Also Read:శ్రీరామ నవమి విశిష్టత
ట్రంప్ ప్రకటించిన సుంకాలతో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు చవిచూశాయి.

