నిధి అగర్వాల్ హీరోయిన్ గా వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.మైథాలజీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రానికి సునీత్ పడోల్కర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. పోస్టర్‌లో నిధి అగర్వాల్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇప్పటివరకు ఆమె కనిపించని కొత్త అవతార్‌ను పరిచయం చేసేలా ఉంది.
హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పవర్ఫుల్ కథ ని సిద్ధం చేశారు.
ఈ సినిమా టైటిల్‌తో పాటు మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
హీరోయిన్: నిధి అగర్వాల్
దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాత: సునీత్ పడోల్కర్
బ్యానర్: వరాహ్ ఫిల్మ్స్
పిఆర్వో : వంశీ శేఖర్
Also Read;రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

