ఇస్మార్ట్ శంకర్’కు హీరోయిన్‌ దొరికిందిగా..!

495
iSmart Shankar
- Advertisement -

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు పూరీ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు ఇటీవలే ముగిసింది. అయితే, ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం హీరోయిన్ ను ప్రకటించారు.

iSmart Shankar

ఈ మూవీలో ‘సవ్యసాచి’ ఫేమ్‌ నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఆశిష్‌ విద్యార్థి, సత్య దేవ్‌, సుధాన్ష్‌ పాండేలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతా​న్ని అందిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.. సాంకేతిక నిపుణులు : దర్శకుడు: పూరి జగన్నాధ్,నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్,సమర్పణ: లావణ్య,బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్,సంగీతం: మణిశర్మ,సినిమాటోగ్రఫీ: రాజ్ తోట,ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్,ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి, పాటల రచయిత: భాస్కరభట్ల,ఫైట్స్ : రియల్ సతీష్,పి.ఆర్.ఓ : వంశీ – శేఖర్.

- Advertisement -