96 చిత్రంలో నటించే అవకాశం..

260
- Advertisement -

తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో 96 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించవలసిందిగా.. చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Casting Call For #SVC34

ఈ మూవీలో స్కూల్‌ ఏజ్‌లో ఉండే లవ్‌ స్టోరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. తమిళ్‌లో ఆ పాత్రలు చేసినవారికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే మొదటి భాగంలో హీరోహీరోయిన్ల స్కూల్ డేస్‌కు సంబంధించిన సన్నివేశాలు ప్రధానంగా సాగుతాయి. తెలుగులో శర్వానంద్ చిన్ననాటి (స్కూల్ డేస్) పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే పనిలో చిత్రయూనిట్ పడింది. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి మరి..!

- Advertisement -