హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పాతబస్తితో పాటు నాలుగు ప్రాంతాల్లో ఐఎస్‌ఐ సానుభూతి పరులుగా భావిస్తున్న వారి ఇళ్లపై రైడ్స్ చేశారు. తమిళనాడుతో పాటు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. కోయంబత్తూర్ ఉక్కడంలోని సంగమేశ్వరర్ తిరుకోవిల్ అనే పురాతన ఆలయం ముందు గత ఏడాది అక్టోబర్ 23న కారు బాంబు పేలుడు జరిగింది. ఈ కేసులో ఐసిస్ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ.
చెన్నైలోని పూనమల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు రెండు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఆరుగురిపై, జూన్ 2న ఐదుగురిపై చార్జిషీటు దాఖలు చేశారు. 12వ నిందితుడు మహ్మద్ ఇద్రిస్‌ను ఈ ఏడాది ఆగస్టు 2న అరెస్టు చేశారు.
Also Read:సైమా అవార్డ్స్ -2023 విజేతలు వీరే..