వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిన టీమిండియాకు విక్టరీ వెంకటేశ్ మద్దతుగా నిలిచారు. CVR కాలేజీలో సైంధవ్ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో టీమిండియా ప్లేయర్లను కొనియాడారు. అన్ని మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చిన భారత్ ఓడిపోయింది ఒక మ్యాచ్ మాత్రమే. ఆ మ్యాచ్‌తో దాని స్థానం ఏమి తగ్గిపోదు. రోహిత్, విరాట్ సహా ప్రతి ప్లేయర్‌ని చూసి తాము గర్వపడుతున్నామన్నారు. అలాగే, ఈసారి వరల్డ్ కప్ మనదే అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘సైంధవ్’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అన్నట్టు మూవీ నుంచి మరో అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే, ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రాంగ్ యూసేజ్’ అంటూ సాగే ఈ పాటకి సంతోష్ నారాయణ సంగీతం అందించగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. డబ్బుని, ఫోన్, మద్యాన్ని ఇలాంటి వాటిని తప్పు పద్ధతిలో ఉపయోగించకు అంటూ చాలా సింపుల్‌గా సాంగ్‌లో చెప్పేశారు.
ఇప్పుడు రెండో పాటను కూడా ఆల్ రెడీ రిలీజ్ కి రెడీ చేశారు. సినిమాలో ఈ పాట చాలా బాగుంటుందని.. సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తోంది అని తెలుస్తోంది. పైగా ఈ పాటలో వెంకటేష్ కష్టపడి డ్యాన్స్ కూడా వేశారట. మరి వెంకటేష్ ఎలాంటి స్టెప్స్ వేశాడో చూడాలి. ఇక జనవరి 13న ఈ మూవీ విడుదల కానుంది.