రివ్యూ: నెక్ట్స్ నువ్వే..

301
Next Nuvve movie review
- Advertisement -

తొలిచిత్రం ‘ప్రేమకావాలి’తోనే హుషారైన నటుడిగా పేరుతెచ్చుకున్న హీరో ఆది.  శమంతకమణితో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఆది తన గత చిత్రాలకు భిన్నంగా హారర్ కామెడీ జోనర్‌లో చేసిన చిత్రం నెక్ట్స్‌ నువ్వే.  బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో విజయం సాధించిన ‘యామిరుక్క భయమే’ చిత్రానికి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ:

కిరణ్‌(ఆది) ఒక సీరియల్‌ డైరెక్టర్‌.  సీరియల్‌ తీయడం కోసం జేపీ(జయప్రకాష్‌రెడ్డి) వద్ద రూ.50లక్షలు అప్పు చేస్తాడు. ఆ సీరియల్‌ ఫ్లాప్‌ కావడంతో టెలివిజన్‌ వాళ్లు దాన్ని ఆపేస్తారు. దీంతో ఆది తీవ్రంగా నష్టపోతాడు. అప్పు తీర్చేందుకు దారులు వెతుకుతున్న తరుణంలో అరకులో తనకో ప్యాలెస్‌ ఉందని, దానికి తానే యజమాని అన్న సంగతి ఆ కొరియర్‌ ద్వారా తెలుస్తుంది. దీంతో ఆ ప్యాలెస్‌ను వెతుక్కుంటూ వెళ్తాడు కిరణ్‌. ఈ సమయంలో శరత్‌(బ్రహ్మాజీ) రష్మి(రష్మి గౌతమ్‌) పరిచయం అవుతారు. ఈ నలుగురూ ఆ ప్యాలెస్‌ను బాగుచేసి దాన్నో రిసార్ట్‌లా తీర్చిదిద్దుతారు. అయితే అందులో అడుగు పెట్టిన వాళ్లంతా తెల్లవారేసరికి చనిపోతుంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు? ఆ ప్యాలెస్‌ వెనక కథేంటి? అన్నదే  నెక్ట్స్‌ నువ్వే.

Next Nuvve movie review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్  బ్రహ్మాజీ కామెడీ, నిర్మాణ విలువలు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు హీరోతో పాటు ఉండే బ్రహ్మాజీ కామెడీ కడుపుబ్బా నవ్వించింది. హీరో ఆది తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గత చిత్రాల కంటే ఆది ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. బ్రహ్మాజీ చెల్లెలుగా రష్మీ చేసిన నటన మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మైనస్ పాయింట్స్ హారర్ అంశాలు లేకపోవడం, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌,సెకండాఫ్‌. ఇంటర్వెల్ వరకు కామెడీతో లాగించేసిన ప్రభాకర్ సెకండాఫ్‌లో కథేంటో రీవిల్ చేయకపోవడం మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. అసలు రిసార్ట్స్‌లో దెయ్యం ఎందుకుంది… దాని కథేంటి…అనేది జస్టిఫికేషన్ ఇవ్వలేదు.
 
సాంకేతిక విభాగం:

దర్శకుడిగా ప్రభాకర్‌కు ఇది తొలి సినిమా. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.  బ్రహ్మాజీతో మంచి కామెడీ ట్రాక్ ను తయారుచేసి కొంత వరకు పర్వాలేదనిపించాడు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. తీసింది కొన్ని లొకేషన్లలోనే అయినా చక్కగా చేశాడు. ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసర సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ , బన్నీ వాస్ లు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Next Nuvve movie review
తీర్పు:

శమంతకమణి తర్వాత ఆది చేసిన డిఫరెంట్ చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. బుల్లితెర నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించిందనే చెప్పాలి.  బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్లస్ కాగా కథ, కథనం లేకపోవడం మైనస్ పాయింట్స్.  మొత్తంగా  హర్రర్ కామెడీని కోరుకునే వారికి నచ్చే మూవీ నెక్ట్స్ నువ్వే.

విడుదల తేదీ:11/03/2017
రేటింగ్:2.5/5
నటీనటులు: ఆది,వైభవి,రష్మి
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాత: కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా, బన్ని వాసు
దర్శకత్వం: పి.ప్రభాకర్‌

- Advertisement -